హౌరా బ్రిడ్జి వద్ద బస్సు బోల్తా..

కోల్‌కతా: ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జికి సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మినీ బస్సు ముందుగా వెళ్తున్న మరో బస్సును ఓవర్‌టేక్ చేయడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. howrah-bus1
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?