ఢిల్లీలో వర్షం.. నీటిలో చిక్కుకున్న బస్సు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ కురిసిన భారీ వర్షానికి .. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. యమునా బజార్ ఏరియాలోని హుమాన్ మందిర్ వద్ద ఓ అండర్ బ్రిడ్జ్ కింద భారీ స్థాయిలో నీరు నిలిచిపోయింది. అయితే ఆ రూట్లో వెళ్తోన్న ఓ బస్సు అక్కడే చిక్కుకుపోయింది. ఆ బస్సులో సుమారు 30 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. నీరు భారీగా చేరడంతో.. బస్సు ముందుకు కదలలేకపోయింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు వచ్చి.. బస్సులో ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..