ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తప్పిన ప్రమాదం

అమరావతి : విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ ఎమ్యెల్యేల పర్యటనకు ఆటంకం కలిగింది. ఎమ్యెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలో రాగానే రోడ్డు పక్కన మట్టిలో దిగబడింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బస్సుకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో.. ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. 35 మంది ప్రజా ప్రతినిధులను వేరే వాహనాల్లో పోలవరానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపారు.

Related Stories: