మార్చి 9 వ‌ర‌కు బొమ్మ ప‌డ‌న‌ట్టే..!

డిజిటల్‌ ప్రొవైడర్స్‌ వసూలు చేస్తున్న ఛార్జీలకు నిరసనగా ఐదు రాష్ట్రాల చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి బంద్ ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. మార్చి 2 నుండి ఏపీ, తెలంగాణ‌ల‌లోనే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలోను ఇదే పరిస్థితి నెలకొంది. డిజిటల్‌ ప్రొవైడర్లు, వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌, కట్‌ ఆఫ్‌ టైమ్‌ తగ్గించాలనే అంశంపై డిజిటల్‌ ప్రొవైడర్స్‌తో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడం వలన బంద్ చేప‌ట్టారు. అయితే రీసెంట్‌గా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. వీపీఎఫ్‌ 16 శాతం తగ్గిస్తామని సర్వీస్‌ ప్రొవైడర్లు చెప్పగా, ఈ హామీపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 9 వ‌ర‌కు బంద్ కొన‌సాగిస్తామ‌ని నిర్మాత‌లు అంటున్నారు. ఆ త‌ర్వాత మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌రిపి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ్ ఏంటో తెలియ‌జేస్తామ‌ని అంటున్నారు. బంద్ ప్ర‌భావం వ‌ల‌న తెలుగు రాష్ట్రాల‌లో సుమారు 1700 థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు