‘దక్షిణాది రాష్ర్టాల్లోను బుల్లెట్ రైలు’

హైదరాబాద్: దక్షిణాది రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. లేఖలో దక్షిణాది రాష్ర్టాల్లోను బుల్లెట్ రైలు ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు లను కలుపుతూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ముంబై నుంచి అహ్మ‌దాబాద్ మ‌ధ్య బుల్లెట్ రైలు నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌ధాని మోడీ, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే గడిచిన గురువారం నాడు అహ్మ‌దాబాద్ లో శంకుస్థాప‌న చేసిన విషయం తెలిసిందే.

Related Stories: