కోల్‌కతా నుంచి చైనాకు బుల్లెట్‌రైలు

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నుంచి చైనా లోని కున్మింగ్‌కు బుల్లెట్‌రైలు వేయాలని తమ ఏదశం ఆలోచిస్తున్నట్టు చైనా దౌత్యవేత్త మా జాన్‌వూ తెలిపారు. మయన్మార బాంగ్లాదేశ్ గుండా వెళ్లే ఈ రైలు భారత, చైనాల అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. కోల్‌కతా నుంచి కున్మింగ్‌కు కొన్నిగంటల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. 2800 కిలోమీటర్ల ఈ రైలు మార్గం వెంబడి ఆయా దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పితే ఆర్థికవృద్ధి జరుగుతుందని కోల్‌కతాలో కాన్సల్ జనరల్‌గా పనిచేస్తున్న జాన్‌వూ అభిప్రాయపడ్డారు. బాంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్‌ల మధ్య బంధం బలపడుతుందని, ప్రాచీన కాలంనాటి సిల్క్‌రూట్ పునరుజ్జీవం పొందుతుందని ఆయన అన్నారు.

Related Stories: