మహారాష్ట్రలో వాటర్‌షెడ్ల పరిశీలన

-రాలేగావ్‌సిద్ది, హివారేబజార్ గ్రామాలను సందర్శించిన తెలంగాణ బృందం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహారాష్ట్రలో విజయవంతమైన వాటర్‌షెడ్లను తెలంగాణ బృందం పరిశీలించింది. కృష్ణానది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ) ఆధ్వర్యంలో బృందం గురువారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను సందర్శించింది. అన్నాహజారే స్వగ్రామం రాలేగావ్‌సిద్దితోపాటు హివారేబజార్‌లో బృందసభ్యులు పర్యటించారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ చైర్మన్ వీ ప్రకాశ్ నేతృత్వంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌలి, కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి వాటర్‌షెడ్లను పరిశీలించారు. హివారేబజార్ గ్రామంలో నీటి వనరులు పెంపొందించుకోవడం, సమృద్ధిగా పంటలు పండిచుకోవడాన్ని ఆ గ్రామ సర్పంచ్ పోపట్‌రావు పవార్ వివరించారు. సమీపంలోని కోయినా డ్యామ్‌ను కూడా బృందం పరిశీలించింది.

Related Stories: