ఢిల్లీలో బీఎస్పీ లీడర్ హత్య

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ(బహూజన సమాజ్ పార్టీ) నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జామై నగర్‌లోని జోఘా భాయ్ ఎక్స్‌టెన్షన్‌లో బీఎస్పీ నాయకుడు దిల్షాద్(35) నివాసముంటున్నారు. దిల్షాద్ యూపీలో పంచాయతీ మెంబర్ కూడా. అయితే దిల్షాద్ ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారీ అయ్యారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న దిల్షాద్‌ను చికిత్స నిమిత్తం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిల్షాద్ మృతి చెందాడు. అయితే ఢిల్లీలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు బీఎస్పీ లీడర్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విబేధాలు రావడంతోనే.. దిల్షాద్‌పై అతని సహచరులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కూతురు(8), ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల వయసు ఒకరిది ఏడు సంవత్సరాలు, మరొకరు ఏడు నెలల పసిబాలుడు. దిల్షాద్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?