రూ.155కే 34 జీబీ డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.155 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్లాన్‌ను కేవలం ప్రమోషనల్ పద్ధతిలో కేవలం కొద్ది మంది వినియోగదారులకే అందించారు. కాగా ఈ ప్లాన్ ఇప్పుడు కస్టమర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. రూ.155 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా చొప్పున 17 రోజుల వాలిడిటీకి గాను 34 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి.

× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు