బీఎస్‌ఎఫ్ జవాను గొంతు కోసిన పాక్ రేంజర్లు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ భధ్రతా దళాలు మంగళవారం బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన సైనికుడు గొంతును కోశాయి. ఈ ఘటనతో మళ్లీ రెండు దేశాల సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావారణం నెలకొన్నది. రాంఘర్ సెక్టార్‌లోని పాక్ దళాలు.. బీఎస్‌ఎఫ్ జవాను గొంతును కోశాయి. బీఎస్‌ఎఫ్ జవాను అనుకోకుండా సరిహద్దును దాటారని అధికారులు తెలిపారు. ఎల్వోసీ వద్ద భద్రతా దళాలు హై అలర్ట్‌ను విధించారు. పాక్ రేంజర్ల వద్ద ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. బోర్దర్ వద్ద ఉన్న సర్కాండా గడ్డిని కోసేందుకు వెళ్లిన జవాన్లపై పాక్ రేంజర్లు ఫైర్ చేశారు. జవాను శరీరం కోసం బీఎస్‌ఎఫ్ చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Related Stories: