బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో అక్టోబర్ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను ప్రారంభించడానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెబీ అనుమతి లభించింది. వ్యవసాయేతర ఉత్పత్తులు ము ఖ్యంగా మెటల్స్‌లో ట్రేడింగ్‌ను ప్రారంభించనున్నట్టు బీఎస్‌ఈ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీల్లో కూడా కమాడిటీ ట్రేడింగ్‌ను అనుమతించనున్నట్టు గత ఏడాది అక్టోబర్‌లోనే సెబీ ప్రకటించింది. ఇందుకోసం శనివారం నాడు లైవ్ మాక్ ట్రేడింగ్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన మాక్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించింది. కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ ప్రారంభం అయితే ఈ రెండు ఎక్సేంజీలలో ఈక్విటీలు, కరెన్సీలు, కమోడిటీలలో ట్రేడింగ్ నిర్వహించినట్టు అవుతుంది.