రూ. 30 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్ స్వాధీనం

ఒడిశా: రూ. 30 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కాథాజోడి వంతెన వద్ద ఆబ్కారీ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో కారులో తరలిస్తున్న 265 గ్రాముల బ్రౌన్‌షుగర్ గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 30 లక్షలుగా సమాచారం. ఈ ఘటనలో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..