ఇరువర్గాల మధ్య ఘర్షణ. అన్నదమ్ములు మృతి

నిజామాబాద్: ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో కత్తిపోట్లకు గురై అన్నదమ్ములు ఇద్దరూ మృతిచెందారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు దుబ్బకాలనీలోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన పవన్, నర్సింగ్. రైల్వేస్టేషన్ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పవన్‌యాదవ్, నర్సింగ్‌యాదవ్‌ల వర్గంపై మరో వర్గం కత్తులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో సంఘటనా స్థలంలో పవన్‌యాదవ్ మృతిచెందగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నర్సింగ్‌యాదవ్ మృతిచెందాడు. దాడికి పాల్పడిన వారు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్, నర్సింగ్‌ల హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. మూడు నెలల కింద సైతం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు