బ్రిటిష్ గూఢచార విద్యార్థికి దుబాయ్‌లో యావజ్జీవం

దుబాయ్‌లో గూఢచార ఆరోపణలపై అరెస్టయిన బ్రిటన్ విద్యార్థి మాథ్యూ హెడ్జెస్‌కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆయన కుటుంబ ప్రతినిధి ఈ సంగతి వెల్లడించారు. యూఏఈ కోర్టు నిర్ణయంపై బ్రిటన్ విదేశాంగమంత్రి జెరెమీ హంట్ తీవ్ర దిగ్భ్రాంతిని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిత్రదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన యూఏఈ నుంచి ఇది ఆశించలేదని, ఇదివరకు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ఈ తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. 31 సంవత్సరాల పీహెచ్‌డీ విద్యార్థి అయిన హెడ్జెస్ 2011 అరబ్ వసంతం విప్లవాల నేపథ్యంలో యూఏఈ అనుసరిస్తున్న అంతరంగిక, విదేశాంగ విధానాలపై పరిశోధన చేస్తున్నారు.

గత మే 5న ఆయనను దుబాయ్ ఏర్‌పోర్టులో అరెస్టు చేశారు. అక్టోబర్ 29న తాత్కాలికంగా విడుదల చేసినప్పటికీ నిఘాలో ఉంచారు. ఆయన భార్య డేనియెలా తడేజా ఊగఢచార ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. విదేసీ ప్రభుపత్వం కొరకు గూఢచర్యం నెరపడం, సైనిక, రాజకీయ, ఆర్థిక భద్రతకు ముప్పు తేవడం అనే ఆరోపణలపై హెడ్జెస్‌ను దుబాయ్ సర్కారు అరెస్టు చేసి కేసుపెట్టింది. ఇప్పుడు అదేకేసులో యావజ్జీవ శిక్ష పడింది.

Related Stories: