33 సెంచరీలు.. 33 బీర్లు.. కుక్‌కు అరుదైన గిఫ్ట్!

లండన్: 33 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న ఇంగ్లండ్ టీమ్ ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు బ్రిటిష్ మీడియా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. తన చివరి టెస్ట్‌లో అతను సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి 33వ సెంచరీ కావడం విశేషం. దీంతో దానికి గుర్తుగా అతని ఫేర్‌వెల్ ప్రెస్‌మీట్‌లోనే కుక్‌కు 33 బీర్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చారు అక్కడి జర్నలిస్టులు. ఒక్కో బీర్ బాటిల్‌పై ఒక్కో జర్నలిస్ట్ సందేశం ఉండటం మరో విశేషం. కుక్ 12 ఏళ్ల కెరీర్‌ను దగ్గర నుంచి చూసిన స్పోర్ట్స్ జర్నలిస్టులంతా ఈ గిఫ్ట్ ఇచ్చారు. మా మీడియా తరఫున ఇదో బహుమతి. ఇన్నేళ్లలో మీరు ఓ ప్లేయర్‌గా, కెప్టెన్ ఇంగ్లండ్ క్రికెట్‌కు అందించిన సేవలకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం.. ముఖ్యంగా మీరు మాతో వ్యవహరించిన తీరు అద్భుతం అని ఓ జర్నలిస్ట్ అతనితో అన్నాడు. గతంలో మనం అందరం కలిసి డిన్నర్‌కు వెళ్లినపుడు మీరు ఎక్కువగా వైన్ తాగరని, బీర్లు మాత్రం తాగుతానని చెప్పారు. అందుకే మీరు 33 బీర్ బాటిల్స్‌ను ఇస్తున్నాం. ప్రతి బాటిల్‌పైనా ఒక్కో జర్నలిస్ట్ సందేశం ఉంది అని ఆ జర్నలిస్ట్ చెప్పాడు. తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కుక్ భావోద్వేగానికి గురయ్యాడు.

Related Stories: