బాసర అమ్మవారిని దర్శించుకున్న బ్రిటీష్ దౌత్యవేత్తలు

బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగాధిపతి కైరన్ డ్రాకే, డిప్యూటీ హై కమిషనర్ (తెలంగాణ, ఏపీ) అండ్య్రూ ఫ్లెమింగ్‌తో పాటు రాజకీయ, ఆర్థిక సలహాదారులు నళిని రఘురామన్ దర్శించుకున్నారు. బాసరకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని పూలమాల, శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు ఆలయ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. గోదావరితో పాటు ఆలయ పరిసరాల్లోని పలు ఆలయాలను దర్శించుకున్నారు. వారి వెంట భైంసా డీఎస్పీ అందె రాములు, ఆలయ ఏఈవో శ్రీనివాస్, ముథోల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తోట మహేశ్ ఉన్నారు.

Related Stories: