బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థిపై కత్తితో దాడి

-జెయిర్ బొల్సోనారోకు తీవ్ర గాయాలు.. - ఎన్నికల ప్రచారంలో ఘటన రియో డీ జెనిరో: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అతివాద సోషల్ లిబరల్ పార్టీ అభ్యర్థి జెయిర్ బొల్సోనారో (63)పై గురువారం దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేశాడని బొల్సోనారో తనయుడు ఫ్లావియో చెప్పారు. కాలేయం, ఊపిరితిత్తులు, పేగుల్లో గాయాలై రక్తం బాగా పోయిందని తెలిపారు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దాడికి పాల్పడిన 40 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Related Stories: