బుల్లితెర‌పై బ్ర‌హ్మీ సంద‌డి

ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోలు సైతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు. నాగార్జున‌, చిరంజీవి, ఎన్టీఆర్‌, రానా ,నాని త‌దిత‌రులు రియాలిటీ షోస్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇక ఇప్పుడు హాస్య బ్ర‌హ్మ బ్రహ్మానందం వంతు వ‌చ్చింది. ఇన్నాళ్లు త‌న కామెడీతో వెండితెర‌పై గిలిగింత‌లు పెట్టిన బ్ర‌హ్మి త్వ‌ర‌లో బుల్లితెర‌పై కామెడీ షోతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నార‌ట‌. ఈ కామెడీ షోకి బ్రహ్మానందం వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిడం విశేషం.

ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం లేని సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. హీరోల క‌న్నా ఈ క‌మెడీయ‌న్‌కి ఎక్కువ క్రేజ్ ఉండేది. త‌న‌దైన శైలిలో హావ‌భావాలు ప‌లికిస్తూ పొట్ట చెక్క‌లయ్యేలా న‌వ్వించిన బ్ర‌హ్మి ఈ మ‌ధ్య స‌రైన ఆఫ‌ర్స్ అందుకోవ‌డం లేదు. అందుకేనేమో ఇప్పుడు కామెడీ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు బ్ర‌హ్మీ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క‌మెడీయ‌న్ హోస్ట్ చేస్తున్న కార్య‌క్ర‌మంకి సంబంధించిన ప్రోమో రీసెంట్‌గా విడుద‌లైంది. ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ షోని సదరు ఛానల్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బ్రహ్మి తొలిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్న షో కావడం క్రేజ్ నెలకొని ఉంది. అలీ లాంటి కమెడియన్స్ ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్ గా మారారు.

× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158