అపహరణ గురైన బాలుడి ఆచూకీ లభ్యం

హైదరాబాద్: నిన్న నగరంలోని మలక్‌పేటగంజ్‌లో అపహరణకు గురైన ఏడాది వయసు బాలుడి ఆచూకీ లభించింది. బాలుడు అపహరణ కేసులో పోలీసులు రాజ్‌కుమార్, సురేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా పిల్లలు లేనందున పెంచుకునేందుకు బాలుడిని అపహరించినట్లు రాజ్‌కుమార్ తెలిపాడు. దుండగులు ఓ యాచకురాలి నుంచి బాలుడిని అపహరించారు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?