రాజేంద్రనగర్‌లో నాలుగేళ్ల బాలుడు అపహరణ..

రంగారెడ్డి: రాజేంద్రనగర్ లోని చింతల్‌మెట్ లో నాలుగేళ్ల ఖలీముద్దీన్ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇంటివద్ద ఆడుకుంటున్న తమ కుమారుడిని ఓ మహిళ అపహరించినట్లు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Related Stories: