మేరీ కోమ్‌ గోల్డెన్‌ పంచ్‌

హోచిమిన్హ్ సిటీ : మేరీ కోమ్‌ మళ్లీ గోల్డెన్‌ పంచ్‌ విసిరింది. అయిదవ సారి ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నది. స్టార్‌ బాక్సర్‌ ఇవాళ జరిగిన ఫైనల్లో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. 48 కేజీల విభాగంలో నార్త్‌ కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌ను ఈజీగా ఓడించింది. భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్‌.. ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. సెమీస్‌ బౌట్‌లోనూ ఆమె 5-0తో సుబాసా కొముర (జపాన్)పై గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరుసార్లు తలపడిన మేరీ అయిదుసార్లు స్వర్ణంతో మెరిసింది. ఈ విక్టరీతో 48 కేజీల బౌట్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా మేరీ రికార్డుకెక్కింది.
× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్