శ్రీదేవి అభిమాని ప్ర‌శ్న‌కి బోని స‌మాధానం

జూన్ లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన 19వ ఐఫా అవార్డుల వేడుక బ్యాంకాక్ లో ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే . మామ్ మూవీకిగాను నేషనల్ అవార్డు పొందిన దివంగత శ్రీదేవిని ఐఫా అవార్డుల్లోనూ ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్ ఈ అవార్డు అందుకున్నాడు. అయితే శ్రీదేవికి నివాళిగా నిర్వాహకులు ఓ వీడియోని ప్రదర్శించారు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. గ‌త ఆదివారం ఐఫా కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవికి నివాళి అర్పిస్తూ ప్రదర్శించిన వీడియో తను రూపొందించిందే అని తెలిసి షాక్ అయ్యాన‌ని, ఐఫా నిర్వాహకులు తను ఎంతో ఇష్టంగా తయారు చేసిన వీడియోని వాడారని తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది ఢిల్లీకి చెందిన సబా ఆరీఫ్ అనే అభిమాని. ఈ వీడియోని నా అనుమతి లేకుండా వారు ఎలా ప్రదర్శిస్తారు. కనీసం నా పేరు కూడా ఎక్కడ వేయలేదు అని చెప్పుకొచ్చింది. ఈ వివాదంపై తాజాగా బోని క‌పూర్ స్పందించారు.

శ్రీదేవి అభిమాని అయిన స‌బా త‌ను రూపొందించిన వీడియోలో ఉన్న ఫోటోల‌పై హ‌క్కులు అన్నీ నాకే ఉన్నాయి. స‌మ‌స్య ఉంటే న‌న్ను సంప్ర‌దిస్తే పోయేది. కాని ఇలా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంటి. ఐఫా కోసం య‌శ్ రాజ్ ఫిలింస్‌తో మాట్లాడి వీడియో ఓకే చేసింది నేనే అని బోని తెలిపారు. దీనికి స‌మాధానంగా ఫోటోల‌పై హ‌క్కులు త‌న‌కి ఉండొచ్చు కాని వీడియోని ప్రాణం పెట్టి త‌యారు చేశాను. దీని కోసం మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టింది. నా బాధంతా అనుమతి లేకుండా నేను రూపొందించిన వీడియోను ఐఫాలో వాడినందుకు బాధపడుతున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను అది నా వీడియోనే. ఇప్ప‌టికైన ఇది గుర్తించాలి అని స‌బా స్ప‌ష్టం చేసింది.

Related Stories: