నాకు సీఎం కేసీఆర్ అంటే దేవునితో సమానం

హైదరాబాద్: ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంఛార్జ్ బొమ్మెర రామ్మూర్తి ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మధిర నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్‌గా బొమ్మెర రామ్మూర్తిని కేటీఆర్ నియమించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ.. నేను మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాకు సీఎం కేసీఆర్ అంటే దేవునితో సమానం. నాకు పార్టీలో ఎలాంటి పదవి ఇచ్చినా చిత్తశుద్దితో పనిచేస్తా. మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురువేస్తాం. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న కేటీఆర్‌కు ధన్యవాదాలు. అని రామ్మూర్తి పేర్కొన్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?