కరెంట్ ఎఫైర్స్

తెలంగాణ ఏజీగా ప్రకాశ్‌రెడ్డి

సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ)గా నియమితులయ్యారు. ఆయన స్వస్థలం వనపర్తి జిల్లా అమరచింత. Prakashreddyహరితహారంలో నిజామాబాద్‌కు అగ్రస్థానంమూడో విడత హరితహారం కార్యక్రమంలో అత్యధిక మొక్కలు నాటి నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఖమ్మం, మూడో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలువగా చివరి మూడు స్థానాల్లో సిరిసిల్ల, గద్వాల, సంగారెడ్డి నిలిచాయి.

హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు

బయో ఆసియా-2018 సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

ఎన్ గోపికి దాశరథి అవార్డు

తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వీసీ, రచయిత ఆచార్య ఎన్ గోపికి 2017 ఏడాదికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డును తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.

పెట్టుబడుల జాబితాలో తెలంగాణ@5

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ర్టాల జాబితాను ప్రకటించింది. ఇందులో అగ్రస్థానంలో గుజరాత్, రెండో స్థానంలో ఢిల్లీ, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్, నాలుగో స్థానంలో హర్యానా, ఐదో స్థానంలో తెలంగాణ ఉంది. ఆయా రాష్ర్టాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణ, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూములు తదితర ఆరు ముఖ్యాంశాలు, 51 ఉప అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.

సమాచార మంత్రిగా స్మృతి

జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సమాచార ప్రసారాల శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. Smriti-Irani

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య

ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం వెంకయ్యనాయుడు 2017, జూలై 18న నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో ఆయన జన్మించారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా, 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, 2017 జూలై 18న కేంద్రంలోని వివిధ శాఖలకు రాజీనామా చేశారు.

తొలి బయో మీథేన్ బస్సు

టాటా మోటార్స్ దేశంలోనే తొలి బయో-సీఎన్జీ (బయో మీథేన్) బస్సును తీసుకువచ్చింది. తేలికపాటి, మధ్యరకం బస్సులో ఈ బయో-మీథేన్ ఇంజిన్లు (5.7 ఎస్జీ, 3.8 ఎస్జీఐ) లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది.

లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డుల ప్రదానం

లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డులు-2017 ప్రదానోత్సవం జూలై 19న జరిగింది. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, జేడీ (యూ) నేత శరద్‌యాదవ్‌లు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ నూతన పార్లమెంటేరియన్లుగా లోక్‌సభ సభ్యులు మీనాక్షి లేఖి (బీజేపీ), సుస్మితా దేవ్ (కాంగ్రెస్), ఉత్తమ పార్లమెంటేరియన్లుగా లోక్‌సభ నుంచి ఎస్‌కే ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్పీ), రాజ్యసభ నుంచి సీతారాం ఏచూరి (సీపీఎం), జయాబచ్చన్, రంజని పాటిల్ (కాంగ్రెస్) పురస్కారాలు అందుకున్నారు.

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్

నాగాలాండ్ సీఎంగా టీఆర్ జెలియాంగ్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. జూలై 21న ఆయన బలనిరూపణ చేసుకున్నారు. దీంతో అంతకుముందు సీఎంగా కొనసాగిన సీఎం షుర్హోజెలీ లీజిత్సు తన పదవికి రాజీనామా చేశారు.

ప్రముఖ శాస్త్రవేత్త యూఎన్‌రావు కన్నుమూత

ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు జూలై 24న మృతిచెందారు. 1984-94 మధ్య ఆయన ఇస్రోకు చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎన్‌రావు శాస్త్రవేత్తగా 10 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పరిపాలనా విభాగం చైర్మన్‌గాను, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. సతీష్ ధావన్ తర్వాత 10 ఏండ్లపాటు ఇస్రోకు చైర్మన్‌గా యూఎన్‌రావు వ్యవహరించారు. 2017 జనవరిలో ఆయన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.

2016లో 927 ఉగ్రదాడులు

భారత్‌లో 2016లో 927 ఉగ్రవాద దాడులు జరిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అత్యధికంగా 2965 ఉగ్రదాడులతో మొదటి స్థానంలో ఇరాక్ ఉండగా, 1340 ఉగ్రదాడులతో రెండో స్థానంలో ఆఫ్ఘానిస్థాన్, మూడో స్థానంలో భారత్, 734 ఉగ్రదాడులతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచాయి. 2016లో భారత్‌లో జరిగిన దాడుల్లో సగానికిపైగా జమ్ముకశ్మీర్‌లోనే జరిగినట్లు వెల్లడించింది. 2015తో పోల్చితే ఇక్కడ 93 శాతం దాడులు పెరిగినట్లు తెలిపింది. 2015తో పోల్చితే దాడులు 16 శాతం పెరుగగా మరణాలు 17 శాతం పెరిగినట్లు అమెరికా విదేశాంగ శాఖ వివరించింది.

రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 2017 జూలై 17న 15వ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగింది. మొత్తం పోలైన ఓట్లలో 65 శాతానికిపైగా రామన్‌థ్ కోవింద్ సాధించి భారీ ఆధిక్యంతో గెలిచారు. విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ 34 శాతం పైగా ఓట్లు వచ్చాయి. రామ్‌నాత్ కోవింద్‌కు 2930 ఓట్లు పోలవ్వగా వాటి విలువ 7,02,044 కాగా మీరాకుమార్‌కు 1844 ఓట్లు పోలవ్వగా వాటి విలువ 3,67,314. కోవింద్ 3.34 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. 99 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనూప్‌మిశ్రా ప్రకటించారు. ఉభయసభలో 717 మంది ఎంపీలకు ఓటు హక్కు ఉంటే వారిలో 714 మంది ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మందికి ఓటు హక్కు ఉంటే 117 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. kovind

రష్యాలో వైమానిక ప్రదర్శన

మ్యాక్స్-2017 పేరిట రష్యాలో వైమానిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలో నాలుగోతరం అధునాతన తరగతికి చెందిన యుద్ధ విమానం మిగ్-35 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలనే ఆసక్తితో రష్యా ఉన్నది. Plane

ఏంజిల్ పార్టికిల్ గుర్తింపు

పదార్థం (మ్యాటర్), వ్యతిరేక పదార్థం (యాంటీ మ్యాటర్) లక్షణాలను కలిగిన ఏంజిల్ పార్టికిల్‌ను అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన షౌచెంగ్ జాంగ్ బృందం తొలిసారిగా గుర్తించింది. ప్రస్తుత పరిజ్ఞానంతో పోలిస్తే చాలా శక్తిమంతమైన యంత్రాలను రూపొందించడానికి వీలవుతుంది. వ్యతిరేక రేణువులను కలిగిన ఒక కొత్త తరగతి రేణువులు కూడా ఉండొచ్చని 1937లో ఇటలీ భౌతిక శాస్త్రవేత్త ఎటోర్ మాజోరానా ప్రతిపాదించారు. వీటికి ఫెర్మియాన్లని పేరు పెట్టారు.

నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ సంచికి 18 లక్షల డాలర్లు

అంతర్జాతీయం చందమామ మీద తొలిసారిగా నమూనాలను సేకరించేందుకు అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఉపయోగించిన ఒక సంచి.. వేలంలో 18,12,500 డాలర్లు పలికింది. చంద్రుడిపై మానవుడు మొదట కాలుమోపి 48 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ వేలాన్ని నిర్వహించారు. 1969లో అపోలో 11 యాత్రలో భాగంగా ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద నుంచి ఒక సెంటీ మీటరు కంటే చిన్నగా ఉన్న నమూనాలను, 500 గ్రాములు, సెంటీమీటరు కంటే పెద్దగా ఉన్న 12 శిలా తునకలను సేకరించారు. చంద్రుడిపైనున్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఐదు భిన్న ప్రదేశాల నుంచి ఈ నమూనాలను తీసుకొచ్చారు.

ఆరోగ్య సంరక్షణ బిల్లులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సెనేట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఒబామా కేర్ స్థానంలో తీసుకురాదలచిన కొత్త ఆరోగ్య సంరక్షణ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు. 100 మంది సభ్యులు ఉన్న సెనేట్‌లో బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ 51 కాకుండా 60 ఓట్లు తప్పనిసరిగా రావాలన్న ఫిలిబస్టర్ నిబంధన ఉంది. డెమొక్రాట్లతోపాటు రిపబ్లికన్ సెనేటర్లు మద్దతు పలుకకపోవడంతో ట్రంప్ బిల్లు పెట్టడంలో విఫలమయ్యారు.

వన్డే మహిళల ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్

-వన్డే మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను ఇంగ్ల్లండ్ జట్టు కైవసం చేసుకుంది. భారత జట్టుపై ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు ఇది నాలుగో ప్రపంచకప్ టైటిల్. ఇంగ్లండ్ క్రీడాకారిణి ష్రబ్‌సోల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును బీమౌంట్ సొంతం చేసుకుంది. విజేత జట్టు ఇంగ్లండ్‌కు రూ. 4.25 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్‌గా నిలిచిన ఇండియా జట్టుకు రూ. 2.12 కోట్లు వచ్చింది. England

జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్ కేరళ

-57వ సీనియర్ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నిర్వహించారు. ఈ టోర్నీలో మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానం హర్యానా, మూడో స్థానంలో పంజాబ్ నిలిచాయి.

పుల్లెల గోపీచంద్‌కు క్రీడా ప్రపూర్ణ

-బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు క్రీడా ప్రపూర్ణ బిరుదును ఇచ్చేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది. ఆయనతోపాటు బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య విజయ్‌భట్కర్‌కు ఏయూ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. Saidulu
× RELATED అతిథి దేవోభవ ఆకర్షిస్తున్న ఆతిథ్య రంగం