సినిమా స్టార్ల రాఖీ సందడి.. ఫొటోలు

రాఖీ పండుగను బాలీవుడ్ సెలబ్రిటీలు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న సమయంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, సారా అలీఖాన్, దీపికా పదుకోన్, అదితిరావ్ హైదరీ పండుగ సందర్భంగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన అక్క శ్వేత నందాతో రాఖీ కట్టించుకుంటున్న ఫొటోను అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ తన చెల్లెలు అనీషాకు రాఖీ శుభాకాంక్షలు చెబుతూ తమ చిన్ననాటి ఫొటోను షేర్ చేసింది. దీపికా బాయ్‌ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్ కూడా ఈ ఫొటోపై స్పందించాడు.
ఇక కపూర్ ఫ్యామిలీలో చాలా మంది అన్నదమ్ములు ఉన్న సోనమ్ కపూర్ తన పెళ్లి సందర్భంగా వాళ్లందరూ ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంది. అయితే నేరుగా వచ్చి రాఖీ కట్టలేకపోతున్నందుకు సారీ కూడా చెప్పింది.
అటు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌కు రాఖీ కడుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మరో నటి అదితిరావ్ హైదరీ తన సోదరులతో కలిసి ఉన్న ఫొటోను రాఖీ సందర్భంగా పోస్ట్ చేసింది.

× RELATED నిందితుడిని వేధించిన ఖాకీలు..