పిల్లలపై దాడి చేస్తారా.. బీజేపీపై రాహుల్ సీరియస్!

న్యూఢిల్లీః ఓ సినిమాపై ఆగ్రహం వాళ్లను విచక్షణ కోల్పేయేలా చేసింది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని దుస్థితిలోకి నెట్టేసింది. ఫలితమే అభంశుభం తెలియని పసివాళ్లు వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా నిన్న గురుగ్రామ్‌లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మూవీ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ వాళ్లను ఉగ్రవాదులతో పోల్చాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలపై దాడిని సమర్థించేంత పెద్ద కారణం ఎప్పుడూ ఉండబోదని ఆయన ట్విట్టర్‌లో అన్నారు. హింస, ద్వేషం అనేవి బలహీనుల ఆయుధాలను ఆయన విమర్శించారు. బీజేపీ చేస్తున్న ఈ హింస, విద్వేష రాజకీయాలు దేశం మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చాయని మండిపడ్డారు. హర్యానాతోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో పద్మావత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురుగ్రామ్‌లో స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పిల్లలు క్షేమంగా బయటపడినా.. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..