ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదిన బీజేపీ లీడర్.. వీడియో

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లోని ఓ పెట్రోల్ పంపు వద్ద ఓ బీజేపీ లీడర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అక్కడ నిలిపి ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను బీజేపీ నేత దయాశంకర్ సింగ్ చితకబాదాడు. అతని ట్రక్కును కూడా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బాధిత డ్రైవర్ మాట్లాడుతూ.. అకారణంగా తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బీజేపీ నేత రాడ్‌తో కొట్టాడని.. ట్రక్కు అద్దాలు పగులగొట్టాడని తెలిపాడు. తన వద్ద ఉన్న రూ. 62,500ల నగదును అపహరించారని స్పష్టం చేశాడు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?