అధిక బరువును తగ్గించే కాకరకాయ జ్యూస్

కాకరకాయలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని చెబుతున్నది. కాకరకాయలతో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. కానీ దాని జ్యూస్‌ను రోజూ తాగితే అనేక లాభాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. కాకరకాయ జ్యూస్‌ను రోజూ పరగడుపునే తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాకరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల అధికంగా ఉన్న బరువు వెంటనే తగ్గిపోతుంది. కొవ్వును కరిగించే పలు ఎంజైమ్‌లు కాకరకాయలలో ఉంటాయి. 2. కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు క్లోమగ్రంథిలో ఉండే బీటా సెల్స్‌ను రక్షిస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. 3. కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. 4. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరిడ్లు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 5. కాకరకాయ జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. మరీ చేదుగా ఉందనుకుంటే తేనె, క్యారెట్ జ్యూస్, యాపిల్ జ్యూస్ కలుపుకుని సేవించవచ్చు. అయితే కాకరకాయ జ్యూస్‌ను సేవించాక కనీసం 1 గంట పాటు ఆగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

Related Stories: