30 వారాల గ‌ర్భం.. అబార్షన్‌కు కోర్టు అనుమతి

ముంబై: మహారాష్ట్రలో 33 ఏళ్ల ఓ మ‌హిళ‌ తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిండంలో లోపం ఉన్న కారణంగా.. కోర్టు ఆ గ‌ర్భిణికి ఊరట కల్పించింది. ప్రైవేటు క్లినిక్‌లో గర్భస్రావం చేయించుకునేందుకు ఇద్దరు సభ్యుల ధర్మాసనం అనుమతి జారీ చేసింది. జస్టిస్ ఏఎస్ ఓకా, ఏఎస్ గడ్కరీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ముంబైలోని జేజే హాస్పటల్ డాక్టర్లు ఆ మహిళ గర్భానికి పరీక్షలు నిర్వహించారు. ఆ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆబార్షన్ చేసుకునేందుకు కోర్టు అనుమతి తెలిపింది. అయితే నాసిక్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో అబార్షన్ చేయించుకోవాలనుకున్న ఆ మహిళ అభ్యర్థనను మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కించింది.

Related Stories: