మాజీ మంత్రి ఆస్తులు సీజ్‌

బెగుస‌రాయి: బీహార్‌లోని మాజీ మంత్రి మంజూ వ‌ర్మ‌ ఆస్తుల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో మాజీ మంత్రి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ‌ఫ‌ర్‌పూర్ షెల్ట‌ర్ హోమ్‌లో జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌లో మాజీ మంత్రి మంజూ వ‌ర్మ‌ భ‌ర్త నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధం ఉన్న‌ మాజీ మంత్రి మంజూ వ‌ర్మ కొన్నాళ్లుగా ఆచూకీ లేరు. ఆమె కోసం రెండు రోజుల‌గా బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. జేడీయూ పార్టీ ఆమెను స‌స్పెండ్ చేశారు. షెల్ట‌ర్ హోమ్‌లో ఉన్న సుమారు 32 మంది మైన‌ర్ విద్యార్థినుల‌ను రేప్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ప్ర‌ధాన‌ నిందితుడు బ్రిజేశ్‌ను అరెస్టు చేశారు.

Related Stories: