కౌశ‌ల్‌ని ప్రేమ‌లో దింపేందుకు గీతా ప్ర‌య‌త్నం

బిగ్ బాస్ హౌజ్‌లో గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న పెళ్లి తంతు 75వ ఎపిసోడ్‌( గురువారం)లో ముగిసింది. బొమ్మ‌ల పెళ్లిలా కాకుండా ఎంతో రియాలిటీగా పెళ్ళి వేడుక జ‌రిపించారు ఇంటి స‌భ్యులు. ఆ త‌ర్వాత శోభ‌నంకి కూడా సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్‌లో మెహందీ, సంగీత్‌, పెళ్లి , శోభ‌నంకి నిన్న‌టి ఎపిసోడ్‌తో ముగింపు ప‌లికారు. అయితే ఇన్నాళ్ళు అమాయ‌కుడిలా ఉన్న గ‌ణేష్‌లో ఇప్పుడు చాలా మార్పు క‌నిపిస్తుంద‌ని త‌నీష్‌.. కౌశ‌ల్‌తో చ‌ర్చించాడు. ఈ విష‌యం తెలుసుకున్న గ‌ణేష్ తాను ఏం త‌ప్పు చేశాడో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. త‌నీష్‌ని ఈ విషయంపై ప‌లుమార్లు అడిగిన అత‌ని నుండి అస‌లు స‌మాధానం రాలేదు. ఇక సామ్రాట్‌, రోల్ రైడాల‌కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గీతా మాధురికి ముద్దు పెట్టడం, పూజాను పెళ్లికి ఒప్పించడం, గణేష్‌ను స్విమ్మింగ్ ఫూల్‌లోకి తోయడం, రెండు స్వీట్స్ బాక్స్‌లను ఎవరికీ కనిపించకుండా తినడం టాస్క్‌ల‌ని విజ‌యవంతంగా పూర్తి చేయ‌డంతో ఆ ఇద్ద‌రికి వారి ఇంటి నుండి వ‌చ్చిన విలువైన బ‌హుమ‌తుల‌ని బిగ్ బాస్ అందించారు. దీంతో సామ్రాట్‌, రోల్ రైడా చాలా సంతోష‌ప‌డ్డారు. ఇక ఈ వారం కెప్టెన్ పోటీదారునిగా ఉండేందుకు అంద‌రు ఆస‌క్తి చూపుతారు. ఎవ‌రికి వారు తాము గేమ్ బాగా ఆడామ‌ని చెప్పుకుంటూ మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌మ‌ని ఇత‌ర ఇంటి స‌భ్యుల‌ని కోరారు. పెళ్లి టాస్క్‌ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసినందుకు ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ 2000 పాయింట్స్ ఇచ్చారు. అద‌న‌పు పాయింట్స్ కోసం మ‌రో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్‌. టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు . తనీష్, అమిత్, పూజా, గణేష్, సామ్రాట్‌లు ఒక టీంగా ఉండగా.. మిగిలిన కౌశల్, దీప్తి, గీతా మాధురి, శ్యామలలు మరో టీంగా ఉన్నారు. ఈ టాస్క్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న రోల్ రైడా సంచాలకులకుగా ఉన్నారు. త‌క్కువ టైంలో ప‌జిల్ టాస్క్‌ని పూర్తి చేసినందుకు రోల్.. త‌నీష్ టీంని విజేత‌గా ప్ర‌క‌టించాడు. ఇక వారికి ల‌భించిన పాయింట్స్ తో ఈ వారం కావ‌ల‌సిన స‌రుకుల లిస్ట్‌ని బోర్డ్‌పై రాసి స్టోర్ రూంలో పెట్టారు. ఈ రోజు విడుద‌ల అవుతున్న నీవెవ‌రో సినిమా ప్ర‌మోష‌న్ కోసం చిత్ర ప్ర‌ధాన పాత్రధారులు ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టారు. బిగ్ బాస్ రేడియో షో కోసం తాప్సీ ఆర్జే అవ‌తారం ఎత్త‌గా, నీవెవ‌రో టీం కంటెస్టెంట్స్ ప్రపోజల్ టాస్క్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచి లవ్‌లో పడేయాలని రొమాంటిక్ టాస్క్ ఇచ్చారు. ముందుగా నీవెవ‌రో చెప్పి పూజాని ప్రేమ‌లో ప‌డేయాల‌ని సామ్రాట్‌కి చెప్పారు ఆది. దీంతో శీర్షాస‌నం వేసి పూజా ప్రేమ‌ని గెలుచుకున్నాడు సామ్రాట్‌. ఇక గణేష్‌, దీప్తి, అమిత్‌లు గుడ్డు టాస్క్ చేసి కామెడీ చేయాల‌ని రితికా చెప్ప‌డంతో వారు ముగ్గురు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఇక ఆ త‌ర్వాత గీతాకి టాస్క్ ఇచ్చారు. కౌశ‌ల్‌ని బిగ్ బాస్‌గా ఊహించుకొని ఆయ‌న‌కి మంచి నేర్పిస్తూ ప్రేమ‌లో ప‌డేయాల‌ని నీవెవ‌రో టీం కోరింది. కౌశ‌ల్‌ని ఇంప్రెస్ చేసేందుకు గీతా మాధురి ఎంతో ప్ర‌య‌త్నం చేయ‌గా, త‌న చేయి వ‌దిలి ఐదు అడుగుల దూరంలో ఉండాల‌ని హెచ్చ‌రించాడు. నువ్వు నా చేయి వ‌ద‌ల‌క‌పోతే నిన్ను జైలుకి పంప‌డం లేదా ఎలిమినేష‌న్‌కి నామినేట్ చేస్తాను అని కౌశ‌ల్ .. గీతాకి వార్నింగ్ ఇస్తాడు. అయిన‌ప్ప‌టికి గీతా .. కౌశ‌ల్ చేయి వ‌ద‌ల‌లేదు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన టాస్క్ కాస్త ఆస‌క్తిక‌రంగా సాగింది. అనంతరం రోల్ రైడా ‘నీవెవరో.. నీవెవరో’ అంటూ ర్యాప్ సాంగ్‌తో ఊపేశాడు. తనీష్.. తాప్సిని ప్రేమలో పడేయడానికి ట్రై చేశారు. ఇక ఈ ‘నీవెవరో లవ్ ప్రపోజ్ టాస్క్’ రంజుగా సాగుతుండగానే ఎపిసోడ్ 75కి ఎండ్ కార్డ్ పడింది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో కెప్టెన్ పోటీదారులు ఎవ‌రో తెలియ‌నుంది.

Related Stories: