నిద్ర‌లో లేచి మ‌రీ డ్యాన్స్ చేసిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 87లో కొన‌సాగిన టాలీవుడ్ మార‌థాన్ టాస్క్ ఎపిసోడ్ 88లోను కొన‌సాగింది. అర్ధ‌రాత్రి స‌మ‌యంలోను బిగ్ బాస్ సాంగ్స్ ప్లే చేయ‌డంతో నిద్ర‌లో లేచి మ‌రీ స్టెప్పులేశారు. అయితే నిద్ర‌లో ఉన్న‌ప్ప‌టికి త‌మ‌కి కేటాయించిన సాంగ్స్‌ని గుర్తు పెట్టుకొని మరీ డ్యాన్స్ ఫ్లోర్‌పై వెళ్ళి వీరు డ్యాన్స్ చేయడం ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది. మ‌ధ్య‌లో సామ్రాట్‌ని కన్ఫెష‌న్ రూంకి పిలిచిన బిగ్ బాస్ కోర్టు ప‌నుల వ‌ల‌న మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కి పంపిస్తున్నాం. పని చూసుకొని తిరిగి రావ‌ల‌సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు.

అయితే టాలీవుడ్ మార‌థాన్ టాస్క్‌లో వ‌రుస‌గా సాంగ్స్ ప్లే అవుతుండ‌డంతో కంటెస్టెంట్స్ కొంత అల‌సిపోయిన‌ట్టుగా క‌నిపించారు. ఏ ప‌నిలో ఉన్నా కూడా సాంగ్ ప్లే కాగానే డ్యాన్స్ ఫ్లోర్ ద‌గ్గ‌ర‌కి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి డ్యాన్స్ చేశారు. బుధ‌వారం రోజు బిగ్ బాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడ‌త‌లుగా కేక్ పంపించారు. ఆ కేక్‌ని ఇంటి స‌భ్యులంద‌రు తిని, సంతోషంగా ఉండాల‌ని చెప్ప‌డంతో క‌ష్టం మీద కేక్ తిని హ్య‌పీగా ఉన్నారు. ఇక బిగ్ బాస్ బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్భంగా ఇంటి స‌భ్యులంద‌రికి ఇచ్చిన టాస్క్ పేరు పిక్ష‌న‌రీ. టాస్క్‌లో ప్ర‌తి ఇంటి స‌భ్యుడు కార్డ్‌లో తెలిపిన వాటిని వైట్ బోర్డ్‌పై బొమ్మ గీయాల్సి ఉంటుంది. ఆ బొమ్మ ఏమిటో మిగతా ఇంటి స‌భ్యులు చెప్పాల్సి ఉంటుంది.

టాస్క్‌లో భాగంగా ఇంటి స‌భ్యులు అంద‌రు వైట్ బోర్డ్‌పై బొమ్మ‌లు గీయ‌గా వాటిని మిగ‌తా వారు గుర్తు ప‌ట్టారు. అయితే దీప్తి వేసిన‌ డ్రాయింగ్ చూసి మిగ‌తా వారు కింద‌ప‌డీ మ‌రి న‌వ్వారు. ఈ టాస్క్ పూర్తి కావ‌డంతో మ‌ళ్ళీ సాంగ్స్ ప్లే అవ్వ‌డం స్టార్ట్ అయింది. ఎవ‌రికి ఇచ్చిన సాంగ్స్ కి వారు స్టెప్పులు వేశారు. మధ్య‌లో కౌశ‌ల్ ప్యాంట్ జారిపోతున్నా కూడా అది స‌రిచేసుకునే టైం అత‌నికి ఇవ్వ‌లేదు బిగ్ బాస్. బెడ్ షీట్ అడ్డు పెట్టుకొని స‌రిచేసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ఆయ‌న సాంగ్ ప‌దే ప‌దే ప్లే చేశారు బిగ్ బాస్. ఇక గీతా మాధురి బాత్రూమ్‌కి వెళ్తున్న స‌మ‌యంలో ఆమెకి కేటాయించిన‌ సాంగ్ ప్లే అవడంతో వెనక్కి వచ్చింది. వెంట‌నే ఆ సాంగ్ ఆపేశారు బిగ్ బాస్. ఆమె బాత్రూమ్‌ లోపలికి వెళ్లిన సమయంలో సాంగ్ ప్లే చేశాడు. అయినా.. ఆమె వెలుపలికి రాలేదు. దీంతో.. కొన్ని పాయింట్లను ఇంటి సభ్యులు కోల్పోవాల్సి వస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ డ్యాన్స్ టాస్క్‌తో ఇంటి స‌భ్యుల‌ని ఓ ఆట ఆడేసుకున్నాడు. ఇక గురువారం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌లో షో ఫైన‌లిస్ట్‌లు ఎవ‌రో తేలిపోనుంద‌ని బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వ‌డంతో అంద‌రిలో ఆతృత‌ నెల‌కొంది.

× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు