కారు నుండి తోసే ప్ర‌య‌త్నం.. ప్ర‌తిఘ‌టించిన దీప్తి, శ్యామ‌ల‌

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 89లో కంటెస్టెంట్స్‌కి ‘టిక్కెట్ టు ఫినాలే’ అనే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్ ప్ర‌కారం ఎవ‌రైతే చివ‌రి వ‌ర‌కు కారులో ఉంటారో వారు ఎలిమినేష‌న్ నుండి మిన‌హాయింపు పొంది డైరెక్ట్ ఫినాలే వ‌ర‌కు వెళ్ళొచ్చు. టాస్క్‌లో పోటీ ప‌డేందుకు తనీష్‌, దీప్తి, శ్యామ‌ల‌, గీతా, సామ్రాట్‌లు కారులో కూర్చున్నారు. బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా అమిత్‌, రోల్ రైడాలు వారికి స‌ప‌ర్య‌లు చేశారు. అయితే కారులో 24 గంట‌లు ఉండాల్సిందిగా బిగ్ బాస్ నిబంధ‌న పెట్ట‌డంతో వారు అంత సేపు ఉండేందుకు తెగ ఇబ్బంది ప‌డిపోయారు. వ‌ర్షం కురుస్తున్న స‌మ‌యంలో దీప్తి చ‌లికి వ‌ణికింది. దుప్ప‌టి కావాల‌ని కౌశ‌ల్‌ని అడ‌గ‌గా, నేను దుప్ప‌టి లేకుండానే ఉన్నాను. దుప్ప‌టి క‌ప్పుకోవ‌డం రూల్స్‌కి విరుద్ధం అంటూ కౌశ‌ల్ చెప్పుకొచ్చాడు లైట్స్ ఆన్ అయిన త‌ర్వాత నిద్ర పోకూడ‌ద‌నే నిబంధ‌న బిగ్ బాస్ హౌజ్‌లో ఉండ‌గా, మార్నింగ్ టైంలో కొద్ది సేపు కారులో కునుకు తీసింది గీతా మాధురి. దీంతో కుక్క‌లు మొరిగాయి. రూల్స్ బ్రేక్ చేశారంటూ గీతాని కారు దిగాల‌ని కోరాడు కౌశ‌ల్‌. నేను ప‌డుకోలేదు, పాట‌లు పాడుతున్నా అని గ‌తా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసిన కౌశ‌ల్ దిగాల్సిందే అని ప‌ట్టుబ‌ట్ట‌డంతో కారు దిగి ఫినాలే టిక్కెట్‌ను తొలుత కోల్పోయింది గీతా మాధురి. ఇక టాస్క్‌లో భాగంగా చివ‌రికి కారులో ఒక‌రే ఉండాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో సామ్రాట్.. శ్యామ‌ల‌ని, త‌నీష్‌.. దీప్తిలని బ‌ల‌వంతంగా కారు నుండి కింద‌కి దింపే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఇది ఫిజిక‌ల్ టాస్క్‌లా మారింది. శ్యామ‌ల‌, దీప్తిలు వారిని ఎంతో ప్ర‌తిఘ‌టించారు. అయితే ఒకానొక సంద‌ర్భంలో దీప్తి జుట్టు, చేయి నేల‌కి తాక‌డంతో ఆమె ఔట్ అయిన‌ట్టే క‌దా అని త‌నీష్‌.. కౌశ‌ల్‌ని అడిగాడు. దీనికి కౌశల్.. బిగ్ బాస్ కాలు మాత్రమే కింద పెట్టాలన్నారని చేయి తగిలితే పరిగణలోకి తీసుకోబడదన్నారు. దీనిపై బిగ్ బాస్ కల్పించుకుని కౌశల్ చెప్పినదాన్నే ఫైనల్ చేశారు. అయితే శ్యామ‌ల కారులోకి వెళ్లే స‌మ‌యంలో ముందు జాగ్ర‌త్త‌గా క‌వ‌ర్స్ తెచ్చుకోవడంపై కౌశ‌ల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చెప్ప‌కుండా క‌వ‌ర్స్ ఎందుకు తీసుకెళ్లావంటూ ఫైర్ అయ్యాడు కౌశ‌ల్‌. దీనిపై కారులో ఉన్న వారు కౌశ‌ల్ గేమ్ ప్లాన్ ఏంటో నాక‌స‌లు అర్దం కావ‌డం లేద‌ని చ‌ర్చించుకున్నారు. అతడి ఆమె భార్య ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకు సహనానికి దన్నం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి. దీనికి శ్యామల కూడా వంతపాడారు. అయితే ఎండ్ బ‌జ‌ర్ మోగే స‌మ‌యానికి కారులో ఒక్కరే ఉండాలి లేదంటే ఫినాలేకి ఎవ‌రు వెళ్ళ‌ర‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో బాత్ రూం వ‌స్తున్న క్ర‌మంలో కారు నుండి సామ్రాట్ దిగి వెళ్లిపోతాడు. ఇక త‌నీష్‌, శ్యామ‌ల‌, దీప్తిలు కారులోనే ఉండిపోతారు. ఉమ్మ‌డి ప్ర‌య‌త్నాన్ని అభినందించిన బిగ్ బాస్ ఎవ‌రు టాస్క్‌లో విజేత కాలేక‌పోయార‌ని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ మార‌థాన్ టాస్క్‌లో గీతా మాధురి ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేయ‌నందుకు ఇంటి స‌భ్యుల‌కి 1400కి గాను 1200 పాయింట్స్ వ‌చ్చిన‌ట్టు బిగ్ బాస్ చెబుతారు. ఆ త‌ర్వాత మ‌ను సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఆ సినిమా టీం బిగ్ బాస్ ఇంటిలోకి వ‌చ్చి వారితో కొద్ది సేపు స‌ర‌దా టైం స్పెంట్ చేస్తారు. ఇక ఆ త‌ర్వాత త‌నీష్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా బిగ్ బాస్ కేక్ పంపించ‌డంతో అంద‌రి మ‌ధ్య కేక్ క‌ట్ చేసి త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటాడు త‌నీష్‌. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ పంపించిన లెట‌ర్స్ చ‌దివి కాస్త ఎమోష‌న‌ల్ కూడా అవుతాడు. ఈ క్ర‌మంలో 90వ ఎపిసోడ్ ముగుస్తుంది. మ‌రి నేడు శనివారం కావ‌డంతో నాని ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి ఎలాంటి సంద‌డి చేస్తాడో చూడాలి.

Related Stories: