మాల్యాకు దెబ్బ.. లండన్‌లో ఆస్తుల జప్తుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

లండన్: ఇండియాలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ తగిలింది. యూకేలోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని యూకే హైకోర్టు కల్పించింది. 13 బ్యాంకులు కలిసి వేసిన కేసును విచారిస్తున్న సందర్భంగా యూకే హైకోర్టు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన ఏజెంట్లు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి వెళ్లొచ్చని అనుమతి ఇచ్చింది. టెవిన్‌లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆదేశాల ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీర్ అక్కడికి వెళ్లి.. సోదాలు నిర్వహించి, అందులో ఉన్న అన్ని వస్తువులను తమ ఆధీనంలోకి తీసుకునే వీలు కలగనుంది. హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. అవసరాన్ని బట్టి హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ఎప్పుడైనా మాల్యా ఇంట్లోకి వెళ్లొచ్చని స్పష్టంచేశారు. అయితే ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.

Related Stories: