వరద నీటిలో చిక్కుకుపోయిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. వీడియో

భువనేశ్వర్ : ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయగడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో భువనేశ్వర్, జగదల్‌పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రైలు ముందుకు కదక్కలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న రైలును చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Related Stories: