50వేల లంచం తీసుకుంటూ చిక్కిన ఇన్‌స్పెక్టర్

భువనేశ్వర్: ఒడిశాలో 50వేలు లంచం తీసుకుంటూ ఓ ఇన్‌స్పెక్టర్ పట్టుబడ్డాడు. జట్నీ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ మొహంతినీ .. విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. క్రిమినల్ కేసులో ఓ వ్యక్తి పేరును చేర్చకుండా ఉండేందుకు అతను డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి విజిలెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల ఆధీనంలోనే ఆ ఇన్‌స్పెక్టర్ ఉన్నాడు. బీహార్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కైమూర్ జిల్లాలో 10వేల లంచం తీసుకుంటూ ఏఎస్‌ఐ మొహమ్మద్ రాషిద్ ఖాన్ పట్టుబడ్డాడు. అతను కూడా ఓ క్రిమినల్ కేసులో లంచం తీసుకుంటూ విజిలెన్స్‌కు చిక్కాడు. మొహనియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య