ఎస్పీ, ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా బంద్

పాట్నా : ఎస్పీ, ఎస్టీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఉన్నత కులాలకు చెందిన కొన్ని వర్గాలు ఈ బంద్ పాటిస్తున్నాయి. బీహార్‌లోని అరాలో రైళ్లను నిలిపేశారు. మార్కెట్లను మూసివేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో మైనార్టీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. మధ్యప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మోరినా, శివపురి, బింద్‌తో పాటు గ్వాలియర్ చంబల్ ప్రాంతాల్లో ఈ నిషేధం ఉంటుంది.

Related Stories: