అంచనాల్ని నిజం చేసింది

భలే మంచి చౌకబేరమ్ వినూత్నమైన కాన్సెప్ట్‌తో అందరిని ఆకట్టుకుంటున్నది. కలెక్షన్స్ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం దిశగా పయనిస్తుందనే విశ్వాసం ఉంది అన్నారు కె.కె.రాధామోహన్. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఆయన విడుదల చేసిన ఈ చిత్రంలో నవీద్, కేరింత నూకరాజు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. అరోళ్ల గ్రూప్ పతాకంపై సతీష్‌కుమార్ నిర్మించారు. మురళీకృష్ణ దర్శకుడు. మారుతి కాన్సెప్ట్ అందించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. మారుతి మాట్లాడుతూ మౌత్‌పబ్లిసిటీతో సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్స్ బాగున్నాయి. మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని మా అంచనాల్ని నిజం చేసింది.

చిన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. కథలో వైవిధ్యం, వినోదం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నదని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలోని తన పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయని రాజా రవీంద్ర చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ కథపై పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాం. ప్రేక్షకాదరణ చాలా బాగుంది. రాబోవు రోజుల్లో పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని నిర్మాత తెలిపారు. మారుతి అందించిన కాన్సెప్ట్‌కు దర్శకుడు పూర్తిగా న్యాయం చేశారు. చక్కటి హాస్యంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తున్నది అని నవీద్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

× RELATED వరుణ్‌ని చూస్తే ఈర్షగా వుంది!