మురుగదాస్ విడుదల చేసిన విన్నర్ సాంగ్

మరో నాలుగు రోజులలో విడుదల కానున్న విన్నర్ సినిమా ప్రమోషన్స్ ఫ్యాన్స్ లో భారీ హైప్స్ తీసుకొస్తున్నాయి. ఒక వైపు చిత్ర సాంగ్స్ విడుదల చేస్తూనే మరో వైపు హీరో హీరోయిన్స్ అనేక ఇంటర్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విన్నర్ . సాయిధరమ్ తేజ్, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రముఖ స్టార్స్ చేతుల మీదుగా పాటలు విడుదల చేస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా భజరంగభళి అనే సాంగ్ తమిళ దర్శకుడు మురుగదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తోంది. మరి ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

Related Stories: