భైర‌వ‌గీత ఫ‌స్ట్ సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల బోల్డ్ కంటెంట్‌తో తెర‌కెక్కుతున్న సినిమాల‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అర్జున్ రెడ్డి త‌ర్వాత అడ‌ల్ట్ మూవీగా తెర‌కెక్కి భారీ విజ‌యం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఇప్పుడు వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న భైర‌వ‌గీత అనే చిత్రం కూడా అదే రేంజ్‌లో ఉంటుంద‌ని తాజాగా విడుద‌లైన ట్రైలర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. ధనంజ‌య‌ మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్ధ తాతులు తెర‌కెక్కించాడు. ఈ మూవీతో ఆయ‌న దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. తాజాగా భ‌గ‌వ‌ద్గీత అనే ప్రోమో వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. సిరాశ్రీ రాసిన ఈ పాట‌ని విజ‌య్ యేసుదాస్‌, సాక్షి హోల్క‌ర్ ఆల‌పించారు. ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మీరు ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.

Related Stories: