డిసెంబర్ 1న పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి!

ముంబై: మరాఠాలకు 15 రోజుల్లో శుభవార్త అందిస్తామని చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సెలబ్రేట్ చేసుకోవడానికి డిసెంబర్ 1న సిద్ధంగా ఉండండి అని మరాఠాలకు మాటిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర బ్యాక్‌వర్డ్ కమిషన్ మరాఠాకు 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసు చేసిన కొద్ది గంటల్లోనే ఫడ్నవీస్ ఈ హామీ ఇవ్వడం విశేషం. 2016 నుంచి ఇప్పటివరకు తమకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ మరాఠాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో గతేడాది మరాఠా సామాజికవర్గ వెనుకబాటును గుర్తించేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు అధ్యయనం చేసి మరాఠాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినట్లు తేల్చింది. రాష్ట్ర జనాభాలో మరాఠాల జనాభా 30 శాతంగా ఉంది.

Related Stories: