స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలి

-నూతన పింఛన్ విధానంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: దేవీప్రసాద్ ఆదిలాబాద్ టౌన్/ఆర్మూర్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విభజన అయ్యాక ఏడాదిలో ఉద్యోగులను విభజన చేస్తామన్న కేంద్రం రెండేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు.. తక్షణమే స్థానికత ఆధారంగా విభజించాలని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రం నూతన పింఛన్ విధానంపై స్పష్ట త ఇవ్వాలని కోరారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన దినం పాటిస్తున్నారని చెప్పారు. చెన్నై, ముంబై హైకోర్టుల మాదిరిగానే తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సమ్మెతో న్యాయశాఖ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి హామీ దొరకటం హర్షణీయమని, సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తులను, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షడు కారం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Stories: