ఆగస్ట్‌లో కోహ్లి, రవిశాస్త్రి ఎంత సంపాదించారో తెలుసా?

ముంబై: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) భారత క్రికెటర్ల సంపాదనకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఆగస్ట్ నెలలో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర టీమ్ సభ్యులు ఎంత మొత్తం సంపాదించారో వెల్లడించింది. కెప్టెన్ కోహ్లి విషయానికి వస్తే ఆగస్ట్‌లో అతడు మొత్తం రూ.కోటి 25 లక్షలు అందుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌తోపాటు ఐసీసీ ప్రైజ్‌మనీ రూపంలో విరాట్‌కు ఈ మొత్తం లభించింది. ఇక కోచ్ రవిశాస్త్రికి మూడు నెలలకుగాను అడ్వాన్స్‌గా రూ.2.05 కోట్లు చెల్లించింది బీసీసీఐ. ఈ ఇద్దరితోపాటు మిగతా ప్లేయర్స్ సంపాదన వివరాలు ఈ కింది టేబుల్లో చూడొచ్చు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం