ఆర్థికమంత్రి ఈటలతో బీసీ నేతల భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌తో బీసీ నేతలు సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు మంగళవారం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. కళాశాల హాస్టళ్లలో మెస్ చార్జీలు చెల్లించడంతోపాటు ఇన్‌చార్జ్‌లను నియమించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల హాస్టళ్లలో ఒక్కోచోట ఒక్కోవిధానం అమలుచేస్తున్నారని వారు మంత్రి ఈటల దృష్టికి తెచ్చారు.

Related Stories: