ఉద్యోగం లేదని.. వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ : ఉద్యోగం లేదని జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్, విజయపురి కాలనీకి చెందిన మలిపెద్ది శ్రీనివాస్‌రెడ్డి(43) ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి బ్రిడ్జి వద్ద చెట్టుకు తాడు తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని... కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు ఉద్యోగం లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related Stories: