టాయిలెట్‌లో పైథాన్.. వైరల్ ఫొటోలు

వర్జీనియా: ఈ ఫొటో చూడగానే టాయిలెట్‌లో కూర్చునే ముందు ఓసారి బాగా చూసుకోవాల్సిందే అనిపించడం ఖాయం. అమెరికాలోని వర్జీనియాకు చెందిన జేమ్స్ హూపర్ అనే వ్యక్తి ఇంట్లోని టాయిలెట్‌లోకి ఈ బాల్ పైథాన్ వచ్చింది. టాయిలెట్‌కు వెళ్దామని చూస్తే ఆ పాము బయటకు తల పెట్టి కనిపించింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. తన ఇంట్లోకి పాములు రావడం కొత్త కాకపోయినా.. టాయిలెట్‌లో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి అని హూపర్ చెప్పాడు. వెంటనే తన రూమ్‌మేట్ కెన్నీ స్ప్రూయిల్‌ను పిలిచిన హూపర్.. ఇద్దరూ కలిసి ఓ ఫిషింగ్ చేసే పోల్ సాయంతో దానిని బయటకు తీశారు. ఆ తర్వాత వర్జీనియా బీచ్ యానిమల్ కంట్రోల్ ఆఫీసర్‌ను పిలిచారు. అయితే అది విషపూరితమైన పాము కాకపోవడంతో దానిని పట్టుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని హూపర్ చెప్పాడు. ఈ ఫొటోలను జేమ్స్ షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారిపోయాయి. ఈ పాములు భయపడినపుడు, ఒత్తిడికి గురైనపుడు ఓ బాల్‌లా ముడుచుకుంటాయి. అందుకే వీటికి బాల్ పైథాన్ అని పేరొచ్చింది. నిజానికి ఈ పామును ఓ ఫ్యామిలీ పెంచుకుంటోంది. రెండు వారాలుగా కనిపించడం లేదని వాళ్లు ఫిర్యాదు చేశారు. జేమ్స్ హూపర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ చూసి వాళ్లు వెళ్లి ఆ పామును తెచ్చుకున్నారు.

× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి