ఎన్టీఆర్ సెట్స్ లో బాల‌కృష్ణ‌.. ఫోటోలు వైర‌ల్‌

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ పేరుతో సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. చిత్రంలో బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తుండగా.. రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంద‌ని అంటున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో బాల‌య్య కృష్ణుడి అవ‌తారంలో క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న ప‌క్క‌న ముర‌ళీ శ‌ర్మ ఉన్నారు. బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి చిత్ర నిర్మాతలు. 1949 జూలై 5న ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఓ గొప్ప చరిత్రకు శ్రీకారం జరిగిన ఆ పవిత్రమైన రోజున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంబించారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
× RELATED శాంసంగ్ నుంచి గెలాక్సీ జె6 ప్లస్ స్మార్ట్‌ఫోన్