ఎన్టీఆర్‌, కళ్యాణ్‌తో బాల‌య్య ముచ్చ‌ట్లు- వీడియో వైర‌ల్‌

నంద‌మూరి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌లు ఇంత‌క ముందు చంద్ర‌బాబు, బాల‌య్య‌తో అంటి ముట్ట‌న‌ట్టుగా ఉండేవారు. కాని హ‌రికృష్ణ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆ ఫ్యామిలీ స‌భ్యులంతా ఒక్క‌ట‌య్యారు. చంద్ర‌బాబు హ‌రికృష్ణ‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాలని ద‌గ్గ‌రుండి చూసుకోవ‌డ‌మే కాకుండా ఆయ‌న పాడె కూడా మోసారు. ఇక బాల‌య్య కూడా క‌ష్ట‌స‌మ‌యంలో వారికి అండ‌గా నిలుచున్నాడు. అయితే రీసెంట్‌గా బాల‌య్య త‌న అన్న కొడుకుల‌యిన ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి ప‌లు విష‌యాల‌పై ముచ్చ‌టించారు. భోజ‌నాలు చేస్తున్న స‌మ‌యంలో వారి ద‌గ్గ‌ర‌కి వెళ్లిన బాల‌కృష్ణ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. బాబాయి మాట‌ల‌ని వారిద్ద‌రు శ్ర‌ద్ధ‌గా వింటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. నంద‌మూరి కుటుంబం ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. బాల‌య్య తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ళ్యాణ్ రామ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Stories: