‘ఎన్టీఆర్’ను మరిపిస్తున్న బాలయ్య..ఫస్ట్ లుక్

క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్ ఎన్టీఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో అద్భుతమైన హావభావాలతో స్టేజీపై ప్రసంగిస్తూ అచ్చం ఎన్టీఆర్‌లా కనిపిస్తున్నాడు బాలయ్య. తాజాగా విడుదలైన లుక్ ఎన్టీఆర్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఈ చిత్రంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తోండగా..బాలీవుడ్ నటి విద్యాబాలన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ లో తెలుగు సినిమా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెచ్.ఎం రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. ఎన్.బి.కె. స్టూడియోస్ పతాకంపై సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, ప్రసాద్‌లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..