వజ్రాల వ్యాపారి హత్య కేసులో మోడల్ నిర్బంధం

ముంబయి: వజ్రాల వ్యాపారి హత్య కేసులో ముంబయి పోలీసులు ఓ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయడంతో పాటు మోడల్, ప్రముఖ టీవీ నటి దేవోలీనా భట్టాచారి(28)ని నిర్బంధించారు. రాజేశ్వర్ ఉదానీ(57) అనే వజ్రాల వ్యాపారి అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. ఇతడి మృతదేహాన్ని రాయ్‌ఘడ్ జిల్లా అటవీ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యాపారికి రాజకీయ నాయకుడు సచిన్ పవార్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సచిన్ పవార్ మహారాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశ్ మెహతాకు అనుచరుడు. అదేవిధంగా గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోని మహిళలతో తరచుగా టచ్‌లో ఉండేవాడని కాల్ డేటా ఆధారంగా తేలింది. హత్య కేసులో పోలీసులు నటి దేవోలీనా భట్టాచార్జిని కొన్ని గంటల పాటు విచారించారు. అంతేకాకుండా సినీ, మోడల్ రంగానికి చెందిన పలువురు మహిళలను విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాపారి రాజేశ్వర్ నవంబర్ 28న అగుపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకపోవడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. చివరికి అటవీ ప్రాంతంలో వ్యాపారి మృతదేహాన్ని కనుగొన్నారు.

Related Stories: